గూఢచారి వస్తున్నాడు

16 Jun, 2018 01:22 IST|Sakshi
అడవి శేష్‌

ఎటువంటి రహస్యాలనైనా ఇట్టే శోధించగలిగే గూఢచారి అతడు. తను చేసిన సాహసాలను చూడాలంటే ఆగస్ట్‌ 3 వరకూ ఆగాల్సిందే అని అడవి శేష్‌ అంటున్నారు. అడవి శేష్, శోభిత ధూలిపాళ్ల జంటగా నూతన దర్శకుడు శశికరణ్‌ తిక్కా రూపొందించిన చిత్రం ‘గూఢచారి’. అభిషేక్‌ పిక్చర్స్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి.

ఈ సినిమాను ఆగస్ట్‌ 3న రిలీజ్‌ చేయనున్నారు. ‘‘షూటింగ్‌ కంప్లీట్‌ అయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అమెరికా, హిమాచల్‌ ప్రదేశ్, పూణే, ఢిల్లీలో షూటింగ్‌ జరిపాం. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ హీరోయిన్‌ సుప్రియ యార్లగడ్డ ఈ సినిమా ద్వారా రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమె ఓ మంచి పాత్ర చేశారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్‌ పాకాల. కెమెరా: షనీల్‌ డియో.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు