ఎవరో కనుక్కోండి?

14 Dec, 2017 00:07 IST|Sakshi

చుక్కకి కూడా కథ ఉంది

‘‘డిసెంబర్‌లో నా బర్త్‌డేకి ఓ సర్‌ప్రైజ్‌’’ అని గత నెల ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో రెజీనా అన్నారు. అన్నట్లుగానే అందరూ ఆశ్చర్యపోయేలా బుధవారం ఓ వెరైటీ లుక్‌లో కనిపించారు. ఇక్కడ మీరు చూస్తున్న లుక్‌ అదే. హెయిర్‌ స్టైల్, వీపు, చేతి మీద ట్యాటూ, వేళ్ల మీద స్నేక్‌ సింబల్‌.. టోటల్‌గా ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత వెరైటీగా కనిపిస్తున్నారు కదూ. హీరో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తోన్న ‘అ’లోనే రెజీనా ఇలా కనిపించనున్నారు. పలు షార్ట్‌ ఫిల్మ్స్‌కి దర్శకత్వం వహించిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నిత్యామీనన్, శ్రీనివాస్‌ అవసరాల, ఈషా రెబ్బా, కాజల్‌ అగర్వాల్‌.. ఇలా భారీ తారాగణంతో సినిమా తెరకెక్కుతోంది. ఒక్కొక్కరి లుక్‌ని విడుదల చేసుకుంటూ వస్తున్నారు.

ట్యాటూకి 12 గంటలు  – ప్రశాంత్‌ వర్మ
బుధవారం రిలీజ్‌ చేసిన రెజీనా లుక్‌ వెనక కహానీ ఏంటని దర్శకుడు ప్రశాంత్‌ వర్మని అడిగితే... ‘‘ఈ క్యారెక్టర్‌ కోసం రెజీనా తన హెయిర్‌ని ట్రిమ్‌ చేసుకున్నారు. మూడు డిఫరెంట్‌ షెడ్యూల్స్‌ కోసం మూడు సార్లు ఆమె ట్రిమ్‌ చేసుకోవాల్సి వచ్చింది. ఫొటోలో కనిపిస్తున్నట్లుగా హెయిర్‌ కట్‌ చేయించుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ‘మో’ అనే ఆర్టిస్ట్‌ రెజీనాకి ట్యాటూ వేశారు. ఈ ట్యాటూ వేయడానికి 12 గంటలు పట్టేది. చెరిపేయడానికి పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఎక్కువ నీళ్లతో కడిగితే చాలు. సినిమా మొత్తం దాదాపు ఈ లుక్‌లోనే కనిపిస్తారు రెజీనా. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ శాంతి క్రియేషన్‌ సూపర్బ్‌. దాదాపు 12 రోజులకు పైగా రెజీనా పాత్ర చిత్రీకరణకు పట్టింది. ట్యాటూలో ఉన్న చిన్న చుక్కకి కూడా స్టోరీ ఉంటుంది. అసలు రెజీనా క్యారెక్టరైజేషన్, సినిమా బ్యాక్‌స్టోరీ ఈ ట్యాటూలోనే ఉంటుంది’’ అన్నారు.

లుక్‌ టెస్ట్‌కి 24 గంటలు  – రెజీనా
బర్త్‌డే బేబి రెజీనాని ‘ఏం నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నారు?’ అని అడిగితే – ‘‘ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్‌ చేసిన షార్ట్‌ ఫిల్మ్స్‌ చూశాను. మంచి స్టఫ్‌ ఉందనిపించింది. ప్రశాంత్‌ ‘అ’ కథ చెప్పగానే, ‘తప్పకుండా చేస్తాను. కానీ, ఈ పాత్ర అయితేనే చేస్తాను. బ్రహ్మాండంగా చేస్తాను’ అన్నా. కోరుకున్న పాత్రనే ఇచ్చారు’’ అని తెలిపారు. ఈ క్యారెక్టర్‌కి ఎలా ప్రిపేర్‌ అయ్యారో చెబుతారా? అన్నప్పుడు – ‘‘కాస్ట్యూమ్స్, మేకప్, హెయిర్‌ స్టైల్‌తో సహా మొత్తం రెడీ అయ్యి, లుక్‌ టెస్ట్‌ చేయడానికి ఫస్ట్‌ డే 24 గంటలు, తర్వాత రోజు 12 గంటలు పట్టింది. మంచి సినిమా చేస్తున్నప్పుడు ‘ఎన్ని అవర్స్‌ కష్టపడ్డాం’ అని ఆలోచించకూడదు’’ అన్నారు.

మరిన్ని వార్తలు