ఆ చిన్నారి ఎవరో చెప్పగలరా?!

20 Nov, 2019 11:31 IST|Sakshi

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రత్యేక సందర్భాల్లో తనదైన శైలిలో ట్వీట్లు చేసి ఆకట్టుకునే బిగ్‌ బీ.. వీలు చిక్కినప్పుడల్లా పాతకాలం నాటి ఫొటోలు షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తన సినిమా షూటింగ్‌ల తాలూకు విశేషాలను కూడా పంచుకుంటారు. అయితే బిగ్‌ బీ గతంలో షేర్‌ చేసిన ఫొటోను భద్రపరచుకున్న ఓ అభిమాని.. మీ చేతుల్లో ఉన్న ఆ చిన్నారి ఎవరు అమితాబ్‌ జీ అంటూ సీనియర్‌ బచ్చన్‌ను ట్విటర్‌లో ప్రశ్నించాడు.

ఇందుకు బదులుగా తను బెబో... కరీనా కపూర్‌ అంటూ అమితాబ్‌ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో తనకు బిగ్‌ బీ రిప్లై ఇవ్వడంతో సదరు ఫ్యాన్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది. కాగా అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌ధీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పుకార్‌’ షూటింగ్‌ సమయంలో బెబోతో పాటు ఆమె అక్క కరిష్మా కపూర్‌ కూడా అక్కడికి వెళ్లేదట. ఇందుకు సంబంధించిన ఫొటోలను అమితాబ్‌ గతంలో షేర్‌ చేశారు. ఇక ఆనాడు అమితాబ్‌ చేతుల్లో చిట్టి పాపాయిగా గారాలు పోయిన బెబో... తదనంతర కాలంలో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. కబీ ఖుషి కబీ ఘమ్, సత్యాగ్రహ, దేవ్‌ వంటి సినిమాల్లో అమితాబ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది కూడా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బన్నీపై కేరళ సీఎం ప్రశంసల వర్షం

కరోనాపై పోరు.. సీసీసీకి బ్రహ్మానందం విరాళం

‘వాసు’ గుర్తున్నాడా? వచ్చి 18 ఏళ్లైంది!

పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్‌ చేస్తున్నా: చిరు

దూరంగా ఉంటునే ఆశీర్వదించారు

సినిమా

బన్నీపై కేరళ సీఎం ప్రశంసల వర్షం

కరోనాపై పోరు.. సీసీసీకి బ్రహ్మానందం విరాళం

‘వాసు’ గుర్తున్నాడా? వచ్చి 18 ఏళ్లైంది!

పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్‌ చేస్తున్నా: చిరు

దూరంగా ఉంటునే ఆశీర్వదించారు

కరోనా పోరు: మరోసారి అక్షయ్‌ భారీ విరాళం