కొత్తవారైనా ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యారు!

9 Nov, 2017 00:27 IST|Sakshi

‘‘భావోద్వేగంతో కూడిన సినిమాను ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా ఉంది. 150 సెంటర్లలో ‘గల్ఫ్‌’ను విడుదల చేస్తే ఇప్పటికీ 16 కేంద్రాల్లో ఆడుతోంది. రూరల్‌ లెవల్లోనూ మా సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది’’ అని దర్శకుడు  పి.సునీల్‌కుమార్‌ రెడ్డి అన్నారు. చేతన్‌ మద్దినేని, డింపుల్‌ జంటగా ఆయన దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్‌. రామ్‌కుమార్‌ నిర్మించిన ‘గల్ఫ్‌’ విడుదలై మంగళవారానికి 25 రోజులైంది. సునీల్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘జగిత్యాల వంటి సెంటర్లో మా సినిమా 25 రోజులు రన్‌ కావడం గ్రేట్‌.

తెలంగాణలో మంచి స్పందన వస్తోంది. రూరల్‌ పీపుల్‌ ఓన్‌ చేసుకున్నారు. ఇందులో నటించింది కొత్తవారైనా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యారు. వాళ్లు కొన్ని గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడివారు గల్ఫ్‌లో ఉన్న తమ పిల్నల్ని వీళ్లలో చూసుకోవడం చూశా’’ అన్నారు. ‘‘రెండు మూడు రోజులకే చిన్న సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది ‘గల్ఫ్‌’కి ఇంతమంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు చేతన్‌ మద్దినేని. ‘‘మా గత సినిమాల కన్నా ‘గల్ఫ్‌’కి ఎక్కువ స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు యక్కలి రవీంద్రబాబు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు