‘సోషల్ మీడియా దుమారమే’

30 Dec, 2017 10:52 IST|Sakshi

జ్యోతిలక్ష్మి సినిమాలో హీరోగా నటించిన సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘గువ్వా గోరింక’ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోషల్ మీడియాపై ఓ ఆసక్తికరమైన పాటను రూపొందించారు. ‘అరె దగ్గరి వాళ్లను దూరం చేసి ఆటాడిస్తది కాకా, ఇది ఆండ్రాయిడూ మజాకా. ఒడవని ముచ్చట రచ్చగ మార్చి పిచ్చెక్కిస్తది కాకా, నువు అందులోన దిగినాకా.. అంటూ సాగే ఈ పాటలో సోషల్ మీడియా ట్రెండ్పై గట్టిగానే విమర్శలు చేశారు. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి, అర్జున్ రెడ్డి ఫేం రాహుల్ రామకృష్ణ, ప్రియాలాల్, మధుమిత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు