వీడి లవ్‌లో  అన్నీ చిక్కులే

31 Jan, 2018 01:14 IST|Sakshi
ఆనంది, జీవీ ప్రకాష్‌ కుమార్, నిక్కీ గల్రానీ

జీవీ ప్రకాష్‌ కుమార్, నిక్కీ గల్రానీ జంటగా ఎం. రాజేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ తమిళ చిత్రాన్ని ‘చెన్నై చిన్నోడు’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ‘వీడి లవ్‌ లో అన్నీ చిక్కులే’ అన్నది ఉప శీర్షిక. యశ్వంత్‌ సాయికుమార్‌ సమర్పణలో వి.జయంత్‌ కుమార్‌ (బి.టెక్‌) తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని నిర్మాత కేవీవీ సత్యానారాయణ రిలీజ్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నేను కూడా డబ్బింగ్‌ సినిమాలతో నిర్మాతగా పరిశ్రమకు పరిచయమై తర్వాత పెద్ద సినిమాలు నిర్మించా.

జయంత్‌ కూడా భవిష్యత్‌ లో మంచి సినిమాలు నిర్మించి, పెద్ద నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి. ఈ చిత్రం ఘనవిజయం సాధించి నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అన్నారు. వి.జయంత్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చిత్రమిది. ప్రకాశ్‌రాజ్‌గారి పోలీస్‌ పాత్ర సినిమాకు హైలైట్‌. జి.వి. ప్రకాష్‌ అద్భుతమైన నటనతో పాటు, మంచి సంగీతం అందించారు. అందమైన ఫారిన్‌ లోకేషన్లలో పాటలు చిత్రీకరించారు’’ అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ఎన్‌.కృష్ణ, పాటల రచయిత సీహెచ్‌ పూర్ణాచారి పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: వెలిదెండ్ల రామ్మూర్తి.  

మరిన్ని వార్తలు