లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన జీవీ సోదరి

26 Oct, 2019 08:59 IST|Sakshi

తమిళసినిమా: 25 ఏళ్ల వయసులోనే 25 చిత్రాలకు సంగీతాన్ని అందించి రికార్డుకెక్కిన సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌. ఈయన సంగీతదర్శకుడిగా బిజీగా ఉంటూనే కథానాయకుడిగానూ రంగప్రవేశం చేసి ఆ శాఖలోనూ సక్సెస్‌ఫుల్‌ నటుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్న జీవీ.ప్రకాశ్‌కుమార్‌ది సినీ వారసత్వం అన్నది తెలిసిందే. ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఏఆర్‌.రెహ్మాన్‌ మేనల్లుడు అంతేకాదు జీవీ భార్య సైంధవి యువ గాయకురాలన్నది తెలిసిందే. ఈయనకు సోదరి కూడా ఇప్పుడు నటిగా రంగప్రవేశం చేసి వరుసగా అవకాశాలను అందుకుంటున్నారు. జీవీ సోదరి భవానీశ్రీ. ఈమె ఇప్పటికే క పే.రణసింగం అనే చిత్రంలో నటించడానికి ఎంపికయ్యారు. విజయ్‌సేతుపతి, ఐశ్వర్యరాజేశ్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో భవానీశ్రీ రెండవ హీరోయిన్‌గా నటిస్తున్నారు.  నవ దర్శకుడు విరుమాండి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. 

కాగా తొలి చిత్రం తెరపైకి రాకముందే భవానీశ్రీ మరో రెండు సూపర్‌ అవకాశాలు తలుపుతట్టాయన్నది తాజా న్యూస్‌. ఈ చిన్నదానికి ధనుష్‌కు జంటగా నటించే అవకాశంతో పాటు మహిళా దర్శకురాలు సుధ కొంగర చిత్రంలోనూ నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు తాజా సమాచారం. ధనుష్‌ త్వరలో పరియేరుం పెరుమాళ్‌ చిత్రం ఫేమ్‌ మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. దీన్ని కలైపులి ఎస్‌.థాను భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి కర్ణన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్టు ప్రచారంలో ఉంది. ఇందులో నటి భవానీశ్రీ ఒక ముఖ్యపాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ఇకపోతే సుధ కొంగర దర్శకత్వంలో కథానాయకిగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సూర్య హీరోగా సూరరై పోట్రు చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సుధ కొంగర చిత్రానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మొత్తం మీద జీవీ.ప్రకాశ్‌కుమార్‌ కుటుంబం నుంచి హీరోయిన్‌  తయారైందన్నమాట. చూద్దాం భవానీశ్రీ నటిగా ఏ స్థాయికి చేరుకుంటారో! 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా