నచ్చిన కానుక

29 Oct, 2019 01:24 IST|Sakshi
హన్సిక

బహుమతులు ఎవరికి ఇష్టం ఉండవు? సందర్భం ఉన్నా లేకున్నా బహుమతులు అందుకోవడం అందరికీ ఇష్టమే. నచ్చిన వస్తువే బహుమతిగా వస్తే? ఆ ఆనందమే వేరు. దీపావళికి తనకు నచ్చిన కారును బహుమతిగా పొందారు హన్సిక. దీపావళి కానుకగా హన్సిక తల్లి మోనా మొత్వాని రోల్స్‌ రాయిస్‌ కార్‌ను కుమార్తెకు గిఫ్ట్‌గా అందించారు. ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పంచుకున్నారు హన్సిక. ఈ కారు ఖరీదు సుమారు 6 కోట్లు పైనే ఉంటుందని సమాచారం. కొత్త కారు పొందిన ఆనందాన్ని వీడియో రూపంలో షేర్‌ చేశారామె. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా, తమిళంలో రెండు సినిమాలు, ఒక వెబ్‌ సిరీస్‌తో బిజీ బిజీగా ఉన్నారు హన్సిక.

మరిన్ని వార్తలు