నిన్ను నేను ఆడిస్తాగా అన్నారు: నటి

17 Jul, 2017 19:02 IST|Sakshi
నిన్ను నేను ఆడిస్తాగా అన్నారు: నటి
తమిళసినిమా: నిన్ను నేను ఆడిస్తాగా అని హన్సికను ప్రభుదేవా అన్నారన్న విషయాన్ని ఆ అమ్మడే స్వయంగా చెప్పారు. హన్సిక ప్రస్తుతం ప్రభుదేవాతో గులేబకావళి చిత్రంలో రొమాన్స్‌ చేస్తున్నది. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ మరో ఐదేళ్ల వరకూ నటిగా బాగా శ్రమించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇంతకుముందు ప్రభుదేవా దర్శకత్వంలో ఎంగేయుమ్‌ కాదల్‌ చిత్రంలో నటించానని, ఆయన నిర్మాతగా బోగన్‌ చిత్రంలో జయం రవికి జంటగా నటించానని గుర్తు చేశారు. తాజాగా ప్రభుదేవాతోనే గులేబకావళి చిత్రంలో నటించడం సరికొత్త అనుభవంగా ఉందని పేర్కొన్నారు.

ప్రతి రోజూ ప్రభుదేవా సెట్‌లోకి వచ్చేటప్పుడు తాను ఎవరో ఒకరిలా మిమిక్రీ చేస్తుంటాననీ చెప్పింది. అది చూసి ఆయన నవ్వుకుంటారని హన్సిక అన్నది. ఆయనతో నటించేటప్పుడు మాత్రం కాస్త గాభరా పడుతుంటానన్నారు. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో డాన్స్‌ చేసేటప్పుడు తడబడుతుంటానన్నారు. అయితే ప్రభుదేవా మాత్రం చాలా కూల్‌గా ఉంటారని, నీకు ఎలాంటి భయం అవసరం లేదు.. నేను నిన్ను ఆడిస్తాగా అని ఎంతో ఎంకరేజ్‌ చేస్తారని హన్సిక చెప్పారు.