ఈ సారి ముస్లిం గెటప్‌లో..

27 Dec, 2018 11:53 IST|Sakshi

సినిమా: నటి హన్సిక వివాదాస్పద గెటప్‌ల్లో ఉచిత ప్రచారాన్ని తెగ పొందేస్తోంది. ఇందులో ఆమె ప్రమేయం లేకపోయినా ప్రైమ్‌ టైమ్‌ వార్తల్లోకెక్కేస్తోంది. ఈ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం మహా. ఇది హన్సికకు 50వ చిత్రం. అంతే కాదు ఈ బ్యూటీ నటిస్తున్న తొలి హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం. ఇందులో అమ్మడు రకరకాల గెటప్‌లు ధరించి పిచ్చపిచ్చగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతకంటే ఎక్కువ వివాదాల్లో నానుతూ ఉచిత ప్రచారాన్ని పొందేస్తోంది. నవ దర్శకుడు జలీల్‌ను పరిచయం చేస్తూ ఎక్స్‌ట్రా ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మాత మదియళగన్‌ నిర్మిస్తున్న చిత్రం మహా. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రానికి ప్రచారాన్ని మొదలెట్టేశారు.

ఇటీవల నటి హన్సిక కాషాయ దుస్తులు ధరించి నోటి నిండా సిగరెట్‌ పీల్సిన పొగతో కాశీ నగర బ్యాక్‌డ్రాప్‌లో సింహాసనంలో కూర్చున్న దృశ్యంతో కూడిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిపై మత సంఘాలు, రాజకీయ నాయకులు విరుచుకుపడ్డారు. పోలీసులకు ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర యూనిట్‌ క్రిస్మస్‌ పండగ సందర్భంగా మహా చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సారి హన్సికను ముస్లిం అమ్మాయి గెటప్‌లో చూపించి, మసీదు ముందు భాగంలో కూర్చుని నమాజ్‌ చేసుకుంటున్నట్లు దృశ్యాన్ని ఆ పోస్టర్‌లో పొందుపరిచారు. ఇంత వరకూ బాగానే ఉన్నా, అదే పోస్టర్‌లో వెనుక భాగంలో హన్సిక తుపాకీ పట్టుకుని కాల్చుతున్నట్లు స్టిల్‌ను చేర్చారు. ఇది కూడా వివాదాంశంగా మారింది. మొన్న హిందువు అమ్మయిగా, ఇప్పుడు ముస్లిం యువతిగా చూపించిన మహా చిత్ర వర్గాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మహా చిత్రానికి మతాలను అంట గట్టరాదని, ఇలాంటి సన్నివేశాలతో మహా చిత్రం ఎలా ఉంటుందన్నది చూడాలని చిత్ర నిర్మాత అంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు