హన్సిక @ 100

21 May, 2018 07:17 IST|Sakshi

తమిళసినిమా: హన్సిక @100 అనగానే మీరు ఆశ్చర్య పడతారని తెలుసు. తను 100 చిత్రంలో నటిస్తోందా? ఆమె నటించిన చిత్రం నూరు రోజులు ఆడిందా? లాంటి పలు సందేహాలు రావచ్చు. అయితే అవేవి నిజం కాదు. హన్సిక క్రేజీ కథానాయికే. విజయ్, సూర్య, ధనుష్,శింబు వంటి స్టార్‌ హీరోలతో నటించి సక్సెస్‌లు అందుకుంది. అలాంటి నటి ఆ మధ్య శివకార్తికేయన్‌తో నటించడానికి ఓకే చెప్పగానే ఆ హీరో అదృష్టం అనే ప్రచారం జరిగింది. ఆయన సరసన నటించిన తొలి క్రేజీ హీరోయిన్‌ హన్సికనే. అంత స్టార్‌ ఇమేజ్‌ను హన్సిక సంపాదించుకున్నారు.ఆ ముద్దుగుమ్మ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి మంచి మార్కెట్‌ను అందుకుంది. ఇంకా చెప్పాలంటే ఈ బ్యూటీ ఖాతాలో విజయాల సంఖ్యే ఎక్కువ.

అయితే ఇప్పుడు ఈ అమ్మడికి కాస్త క్రేజ్‌ తగ్గిందని చెప్పక తప్పదు. కారణాలేమైనా అవకాశాలు పలచబడ్డాయి. చాలా గ్యాప్‌ తరువాత అధర్వకు జంటగా ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. దీనికి శ్యామ్‌ అంటాన్‌ దర్శకుడు. ఈయన ఇంతకు ముందు జీవీ.ప్రకాశ్‌కుమార్‌ హీరోగా డార్లింగ్‌  చిత్రాన్ని  తెరకెక్కించారన్నది గమనార్హం. ఇటీవలే షూటింగ్‌ను ప్రారంభించుకున్న ఈ చిత్రంలో అధర్వ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి హన్సిక నటిస్తోంది. దీనికి 100 అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో అధర్వ పోలీస్‌ పాత్రలో నటిస్తుండడంతో  పోలీస్‌స్టేషన్‌ ఫోన్‌ నంబర్‌ 100 కావడంతో అదే పేరును చిత్రానికి నిర్ణయించినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఈ 100 చిత్రంలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని, ఈ చిత్రంతో కోలీవుడ్‌లో మరో రౌండ్‌ కొట్టడం ఖాయం అనే నమ్మకాన్ని నటి హన్సిక వ్యక్తం చేస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు