వేసవిలో భయపెడతా

12 Oct, 2019 00:32 IST|Sakshi
హన్సిక

విలన్‌ పాత్రలు చేయడానికి హీరోయిన్లు ఆసక్తి చూపుతున్న ట్రెండ్‌ ఇప్పుడు సౌత్‌లోనూ మొదలైంది. నయనతార, త్రిష, రెజీనా, తమన్నా.. ఇలా కొందరు హీరోయిన్లు ఆల్రెడీ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో తన పేరును కూడా లిఖించుకున్నారు హీరోయిన్‌ హన్సిక. హరి–హరీష్‌ ద్వయం దర్శకత్వం వహించబోయే ఓ హారర్‌ కామెడీ సినిమాలో లీడ్‌ రోల్‌ చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌æఇచ్చారీ బ్యూటీ. ఈ చిత్రంలో హన్సిక పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయట. ఇండియన్‌ టీమ్‌ మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. డిసెంబరులో చిత్రీకరణ ప్రారంభించి వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేశారు చిత్రబృందం. ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణలో భాగంగా ముంబైలో ఉన్నారట హన్సిక. ‘పిల్ల జమీందార్‌’, ‘భాగమతి’ చిత్రాల దర్శకుడు జి. అశోక్‌ ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకుడని తెలిసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా