అఖిల్ సినిమా రేసులో మరో దర్శకుడు

23 May, 2016 16:06 IST|Sakshi
అఖిల్ సినిమా రేసులో మరో దర్శకుడు

అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్, తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన అఖిల్ సినిమా అక్కినేని అభిమానులను అలరించలేకపోయింది. దీంతో తన రెండో సినిమా విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు ఈ యువ హీరో. ఇప్పటికే అఖిల్ రెండో సినిమా రేసులో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఫైనల్గా నాగార్జునకు ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అఖిల్ సినిమా ఉంటుదన్న టాక్ బలంగా వినిపించింది.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ఏ జవానీ హై దివానీ' సినిమాను తెలుగు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్. ఈ సినిమాను వంశీ దర్శకత్వంలో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పటివరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. తాజాగా అఖిల్ సినిమా రేసులో మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఇటీవల కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న హను రాఘవపూడి, అఖిల్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట.

ప్రస్తుతానికి వంశీ పైడిపల్లి సినిమాను పక్కన పెట్టి హను సినిమానే ముందుగా సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి హనురాఘవపూడి సినిమా అయినా సెట్స్ మీదకు వస్తుందో..? లేక.. మరోసారి అవన్ని గాసిప్స్ అంటూ అక్కినేని హీరోలు కొట్టిపారేస్తారో...? చూడాలి.