పుట్టినరోజు జరుపుకుంటున్న కామెడీ క్వీన్

20 Jul, 2013 15:51 IST|Sakshi
పుట్టినరోజు జరుపుకుంటున్న కామెడీ క్వీన్

శ్రీలక్ష్మి పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల మెహంలో  నవ్వులు విరబూస్తాయి . ఆమె చేసిన కామెడి క్యారెక్టర్స్ కళ్లముందు కదలాడి మనల్సి నవ్విస్తాయి ..ఒకటా రెండా  రకరకాల పాత్రలలో అలోవోకగా హాస్యాన్ని పండించిన  కామెడీ క్వీన్ శ్రీలక్ష్మి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. "నాన్నా చిట్టీ." అంటూ తనదైన మార్కుతో ఆమె ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.  'అబ్బ.. జబ్బ.. దబ్బ...' అనగానే శ్రీలక్ష్మి టక్కున గుర్తొస్తుంది. రెండు దశాబ్దాల పాటు తన నటనతో ఆంధ్ర ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తారు.

డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యాను అంటారు. కానీ హీరోయిన్ అవుదామని వెండి తెరకు వచ్చిన శ్రీలక్ష్మి హాస్యనటిగా స్థిరపడ్డారు. నటన పై నాకు ఆసక్తి ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో నటినయ్యానని ఆమె తెలిపారు. ఆ రోజుల్లో అప్పటి కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో.. ఏదో ఒక పాత్రలో నటించడమే తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదని అందుకు కారణం నాన్నగారి మరణం అని శ్రీలక్ష్మి వెల్లడించారు. తాను నటించిన ప్రతి చిత్రంలోనూ ప్రత్యేకమైన మ్యానరిజంతో శ్రీలక్ష్మి ప్రేక్షకుల ఆదరణ పొందారు. నటనతో పాటు అమాయకత్వం వల్లనేమో ఆ పాత్రలను ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారు. మరోసారి ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదాం.