హ్యాపీ వెడ్డింగ్‌!

23 Sep, 2017 02:36 IST|Sakshi

యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా ‘హ్యాపీ వెడ్డింగ్‌’ సినిమా తెరకెక్కనుంది. వరుస విజయాలు సాధిస్తున్న యూవీ క్రియేషన్స్‌.. పాకెట్‌ సినిమాతో కలసి నిర్మించనున్న ఈ చిత్రానికి లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం వహించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రేజీ బ్యానర్‌ యూవీ క్రియేషన్స్‌తో అసోసియేట్‌ కావడం హ్యాపీగా ఉంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది.

కథ చెప్పగానే సుమంత్‌ అశ్విన్, నిహారిక ఎక్సైట్‌ అయ్యారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. అక్టోబర్‌ 4న రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కిస్తాం’’ అన్నారు. నరేశ్, మురళీ శర్మ, పవిత్రా లోకేష్, తులసి, నిరోష తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: బాలరెడ్డి.

మరిన్ని వార్తలు