హ్యాపీ వెడ్డింగ్‌ : సంగీత్‌ కంటిన్యూస్‌

4 Jul, 2018 11:00 IST|Sakshi

మెగా వారసురాలు నిహారిక కొణిదెల హీరోయిన్‌ గా నటిస్తున్న తాజా చిత్రం హ్యాపీ వెడ్డింగ్‌. సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు లక్ష్మణ్‌ కర్య దర్శకుడు. సక్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్, పాకెట్‌ సినిమా బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతమందిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఇటీవల యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీద ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు. రేపు తొలి సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ‘దీంతన.. తోంతన..’ అంటూ సాగే ఓ ఫంక్షన్‌ సాంగ్‌ను రేపు (గురువారం) ఉదయం రిలీజ్ చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు