అక్కా మీరు నిజంగానే సిగరెట్‌ తాగారా?

1 May, 2020 14:35 IST|Sakshi

లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. షూటింగ్‌లు నిలిచిపోవడంతో బుల్లితెరకు విరామమిచ్చిన టీవీ సెలబ్రిటీలు.. సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా నటి, యాంకర్‌ హరితేజ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ అక్క హిట్‌ మూవీలో మీరు నిజంగానే సిగరెట్‌ తాగారా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన హరితేజ నిజమేనని చెప్పారు. పాత్ర డిమాండ్‌ చేసిందని..అందువల్ల తప్పలేదని వెల్లడించారు.

అలాగే మరికొందరు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. ఆమె వయసు గురించి ప్రశ్నించగా.. ‘చెప్పిన ఎవరూ నమ్మరు. నమ్మన వినరు. విన్నా అర్థం చేసుకోరు. నిజాలు నిష్టూరమే ఎప్పుడూ.. అయినా చెప్తా.. 24/02/1992’ అని హరితేజ తన పుట్టిన తేదీని వెల్లడించారు. అలాగే అభిమానుల కోరిక మేరకు ఒకట్రెండు పాటలు కూడా పాడారు. కాగా, ఓ వైపు యాంకర్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణించినప్పటికీ.. బిగ్‌బాస్‌లో పాల్గొన్న తర్వాత ఆమె క్రేజ్‌ ఒక్కసారిగా మారిపోయింది.

చదవండి : అవ్రమ్‌కు హెయిర్‌ కట్ చేసిన విరానిక

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు