డాటర్‌ ఆఫ్‌ పార్వతమ్మ

14 Jul, 2018 02:08 IST|Sakshi
హరిప్రియ, సుమలత

వైదేహీ.. పేరు కాస్త క్లాస్‌గా ఉంది కదా అమ్మాయి కూడా అలాగే ఉంటుందనుకోకండి. రఫ్‌ అండ్‌ టఫ్‌. ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ అంటే ఆ మాత్రం రఫ్‌నెస్‌ లేకపోతే ప్రొఫెషన్‌లో రాణించడం కష్టం. ‘తకిటతకిట, అబ్బాయి క్లాస్‌ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా’.. రీసెంట్‌గా ‘జై సింహా’ సినిమాలతో తెలుగు తెరపై కనిపించారు కథానాయిక హరిప్రియ. తెలుగులో అప్పుడప్పుడూ నటించినప్పటికీ కన్నడలో ఆమె బిజీ. హరిప్రియ లేటెస్ట్‌గా నటించిన కన్నడ చిత్రం ‘డాటర్‌ ఆఫ్‌ పార్వతమ్మ’. సీనియర్‌ నటి సుమలత ఈ సినిమాలో పార్వతమ్మ క్యారెక్టర్‌ చేశారు. ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ ౖవైదేహీ పాత్రలో హరిప్రియ నటించారు. చిత్రీకరణ పూర్తయింది. ఓ రియల్‌ ఇన్సిడెంట్‌ ఆధారంగా తెరకెక్కించారట. ‘‘వండర్‌ఫుల్‌ యాక్ట్రస్‌ సుమలతగారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు హరిప్రియ. త్వరలో ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా