రష్మిక అంటే క్రష్‌ అంటున్న హీరో..

10 Apr, 2020 18:42 IST|Sakshi

హీరోయిన్‌ రష్మికా మందన్నాకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి అందరికి తెలిసిందే. చాలా మంది అబ్బాయిల క్రష్‌ ఈ హీరోయిన్‌. తాజాగా ఓ తమిళ హీరో కూడా తనకు రష్మిక అంటే క్రష్‌ అని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తమిళ హీరో హరీష్‌ కల్యాణ్‌ హీరోగా బాలీవుడ్‌ చిత్రం విక్కీ డోనార్‌ను తమిళంలో ‘ధారాళ ప్రభు’ పేరుతో రీమేక్‌ చేశారు. మార్చి 13 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతపడంతో సినిమా ప్రదర్శన ఆగిపోయింది. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 9న డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. 

నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు హరీష్‌ జవాబులిచ్చారు. తనకు ఇష్టమైన సినిమాలు, ఇలా రకరకాల ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఓ వ్యక్తి ‘నీకు ఏ హీరోయిన్‌ అంటే క్రష్‌’ అని అడిగాడు. దీనికి ఆ హీరో సమాధానమిస్తూ.. రష్మికా మందన్నా అని చెప్పారు. ఈ సమాధానం చూసిన పలువురు రష్మికా అభిమానులు ఆశ్చర్యపోయారు. త్వరలో రష్మికాతో ఏమైనా సినిమా చేయబోతున్నారా అని హరీష్‌ను ప్రశ్నించారు. అయితే అందుకు ఆ హీరో ఎలాంటి సమాధానం చెప్పలేదు. అలాగే ఇన్నేళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ఈ సందర్భంగా హరీష్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ప్రస్తుతం హరీష్‌ తెలుగు చిత్రం పెళ్లి చూపులు తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే కరోనా కట్టడిలో భాగంగా అన్ని రకాల షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు