దానాల ప్రభు

9 Jun, 2019 03:44 IST|Sakshi
హరీష్‌ కల్యాణ్

తమిళ యంగ్‌ హీరో హరీష్‌ కల్యాణ్‌ కొత్త చిత్రం కోసం దానాలు చేసే ప్రభువుగా మారిపోయారు. ఇంతకి ఏం దానం చేస్తారు? అన్నదానమా? భూములా? కాదు. డబ్బులా? కానే కాదు. వీర్యం దానం చేస్తాడట. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘విక్కీ డోనర్‌’ తమిళ రీమేక్‌లో హరీష్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన నాని ‘జెర్సీ’లో నాని కుమారుడిగా నటించింది ఇతగాడే. ఆ సినిమా క్లైమాక్స్‌లో తండ్రి గురించి ఎమోషన్‌ స్పీచ్‌ ఇచ్చి, అందర్నీ ఆకట్టుకున్నాడు హరీష్‌ కల్యాణ్‌. ఇక అతను చేయనున్న ‘విక్కీ డోనర్‌’ రీమేక్‌ విషయానికొస్తే.. ‘యుద్ధం శరణం’ ఫేమ్‌ కృష్ణ మరిముత్తు ఈ రీమేక్‌ను డైరెక్ట్‌ చేయనున్నారు. ఈ చిత్రానికి ‘దారాళ ప్రభు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలిసింది. జూన్‌ నుంచి ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

మరిన్ని వార్తలు