బిగ్‌బాస్‌: ఫైనల్‌కు ఆదర్శ్‌, హరితేజ

17 Sep, 2017 10:47 IST|Sakshi
బిగ్‌బాస్‌: ఫైనల్‌కు ఆదర్శ్‌, హరితేజ

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు బిగ్‌బాస్ షో చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి  చేసుకున్న పదో వారంలోకి అడుగుపెట్టబోతోంది. టైటిల్‌ పోరులో కంటెస్టంట్లు అందరూ నువ్వా నేనా అనే రేంజ్‌లో పోటీపడుతున్నారు. గతవారంలో ఎలిమినేషన్స్‌కి నామినేట్ అయిన ఆదర్శ్, హరితేజ, అర్చన, దీక్షలలో ఆదర్శ్, హరితేజలు సేఫ్ జోన్‌లో ఉన్నారంటూ బిగ్‌బాస్‌ వాళ్లకు రిలీఫ్ ఇచ్చారు. దీంతో వారు వారిద్దరూ ఫైనల్‌కి చేరారు. ఇక మిగిలిన అర్చన, దీక్షలలో ఎవరు  ఫైనల్‌కు చేరేది ఆదివారం ఎపిసోడ్‌లో తేలనుంది.

ఇక బిగ్‌బాస్ హౌస్‌లో  ‘జై లవకుశ’ హీరోయిన్‌లు నివేదా థామస్, రాశీఖన్నాలు సందడి చేశారు. బ్యూటీ నివేదా థామస్‌ శివబాలాజీ తో ఆమ్లెట్ చేయించుకుంది. ఇది ఇలా ఉండగా నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సర్‌ప్రైస్‌ ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రావడంతోటే నాక్కూడా ఆమ్లెట్ కావాలంటూ రుచి చూసి సూపర్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేశారు. బిగ్‌బాస్ సీజన్ 1 టైటిల్‌ను శివబాలాజీ, హరితేజ, నవదీప్‌లలో ఎవరో ఒకరు టైటిల్ విన్నర్ అవుతారని అర్చన తెలిపింది. అనంతరం ఎన్టీఆర్‌కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఫుల్ జోష్ ఫుల్ గా మారింది.

ఎన్టీఆర్ వచ్చీ రావడంతోటే పంచ్‌లు పేలుస్తూ హౌస్ మేట్స్ కోసం ‘జై లవ కుశ’ అనే వెరైటీ టాస్క్ ఇచ్చారు. కంటెస్టంట్లతో పాటు నివేదా థామస్, రాశీఖన్నాలు కూడా ఈ టాస్క్‌లో పాల్గొన్నారు.  టాస్క్‌ ముగిసిన తరువాత గెస్ట్‌ లుగా వచ్చిన కళ్యాణ్ రామ్, నివేదా, రాశీ ఖన్నాలు కంటెస్టంట్ల ఫెర్ఫామెన్స్‌ని బట్టి మార్క్ కేటాయించారు. ఇందులో అత్యధికంగా ఆమ్లెట్ వేసి ‘జై’ క్యారెక్టర్ చేసిన శివబాలాజీ ఎక్కువ పాయింట్స్ రాగా.. అర్చన అందరికంటే లీస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి