4 Nov, 2018 10:36 IST|Sakshi

తెలుగులో ఇప్పటి వరకూ ఎన్నో కథలు చూశాం. చూస్తున్నాం. కానీ ప్రస్తుతం జానర్ బేస్డ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఏ జానర్ లో వస్తోన్న సినిమా అయినా హానెస్ట్ గా రాసుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా తెలుగులో వస్తోన్న మరో జానర్ బేస్డ్ మూవీ ‘హవా’. ఇటీవల రానా చేతుల మీదుగా విడుదల చేసిన ఈసినిమా మోషన్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలాగే ‘హవా’ కాన్సెప్ట్ పోస్టర్‌ను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు. సస్సెన్స్, క్రైమ్, కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీకి ‘9 గంటలకు 9 నేరాలు 9 బ్రెయిన్స్’ అంటూ పెట్టిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. మరి ఆ తొమ్మిదిమంది ఎవరు.. ఏం నేరాలు చేశారు.. అదీ తొమ్మిదిగంటల్లోనే.. తద్వారా వాళ్ల లైఫ్ లో జరిగిన మార్పులేంటీ అనేది థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో సాగే కథ.

ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకూ ఎవరూ చిత్రీకరించని లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ ట్రైలర్ ను సినిమా ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ట్రైలర్‌ లాంచింగ్‌ కార్యక్రమానికి 9 మంది సినీ ప్రముఖులు హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. నందిని రెడ్డి, బీవీయస్‌ రవి, మధురా శ్రీధర్‌, వేణు ఊడుగుల, రాజ్‌ కందుకూరి, జానీ మాస్టర్‌లు కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది.
 

మరిన్ని వార్తలు