అత్తపై మమకారాన్ని చాటుకున్న నటి

2 Apr, 2019 14:33 IST|Sakshi

నా జీవితంలో మొదటిసారి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకుంటున్నా.. ఇందుకు సహకరించిన మా అత్తగారికి ధన్యవాదాలు అంటూ నటి, క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ భార్య హాజిల్‌ కీచ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. తనను ఎల్లవేళలా తల్లిలా కనిపెట్టుకుని ఉంటున్న యువీ తల్లి షబ్నమ్‌ సింగ్‌కు ముందుగానే మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి.. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు. ఇక.. తన ముక్కుకు సర్జరీ జరిగిన కారణంగానే ఇన్నాళ్లు సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నానని..ఇకపై అభిమానులకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

లవ్‌ యూ షాబూ!!
‘ఇన్నాళ్లుగా ఎక్కడ దాక్కున్నానా అని ఆశ్చర్యపోయారు కదా. గత నెలలో నా ముక్కుకు సర్జరీ జరిగింది. ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సమస్యను అధిగమించేందుకు మా అత్తగారు సహ‍కరించారు. ముద్దుగా కోప్పడి మరీ నన్ను సర్జరీకి తీసుకువెళ్లారు. ఇలాంటి అత్తగారు దొరకడం నా అదృష్టం.  అంతర్గతంగా తలెత్తిన సమస్యల వల్ల శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డాను. షాబూ పుణ్యమాని ప్రస్తుతం జీవితంలో మొదటిసారిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకోగలుగుతున్నా. ఈ క్రమంలో డైట్‌ నిర్లక్ష్యం చేయడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కాస్త లావయ్యాను. అందుకే ఫొటోలు అప్‌లోడ్‌ చేయలేదు. కానీ జీవితం ఎప్పుడు ఎవరిని ఎక్కడికి తీసుకుపోతుందో తెలియదు. ఆరోగ్యంగా జీవించడమే ముఖ్యం కదా. లవ్‌ యూ షాబూ! హ్యాపీ మదర్స్‌ డే అంటూ షబ్నమ్‌ సింగ్‌తో కలిసి దిగిన ఫొటోను హాజిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘ మంచి భార్యగా గుర్తింపు పొందిన మీరు లావయ్యానని బాధ పడకండి. మీరు చాలా అందంగా ఉన్నారు. మీ అత్తగారితో ఉన్న అనుబంధం గొప్పది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

I’ve not posted in a while so i thought i would fill you in on where Ive been hiding (those of you who were wondering)... A month ago i had a surgery to fix my nose- for as long as i can remember ive struggled to breath through my nose, although not a serious health issue, a chronic one that i just learnt to live with... Lucky enough for me it annoyed my mother-in-law so much that she finally took me to a hospital, 🤪🤣 because of which we came to know just how much internal damage there was and understood the problem! So thanks to her i have a new nose👃🏼(internally) and for the first time in my life i can now breath freely and easily. Due to the surgery i’ve not been active or able to exercise yet, so I’ve put on some weight hence staying away from social media! But fuck it, here i am, better than ever, breathing happily, all thanks to my mother in law who’s receiving blessings from me everyday because finally, finally I CAN BREATHE!!!! It goes to show you, you never know what can lead to where, the things we live with and consider “normal” and sometimes it takes annoying someone to have the best outcome!!!! Love you Shabo! Happy belated mothers day ❤️

A post shared by Hazel Keech Singh (@hazelkeechofficial) on

మరిన్ని వార్తలు