త్వరలో షీనా బోరాపై సినిమా విడుదల!

7 Apr, 2016 18:58 IST|Sakshi
త్వరలో షీనా బోరాపై సినిమా విడుదల!

ముంబై: షీనాబోరా హత్య ఆధారంగా నిర్మిస్తున్న బెంగాలీ చిత్రం 'డార్క్ చాక్లెట్' విడుదలపై బొంబాయి హైకోర్టు స్టేను తిరస్కరించింది. ఈ చిత్రానికి సంబంధించి కోర్టు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్లపై కోర్టుకు నమ్మకం ఉందని.. ఈ చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలలించిన మీదటే విడుదలకు సర్టిఫిట్ ను ఇస్తారని అంది. త్వరలో రానున్న చిత్ర విడుదలను సవాలు చేస్తూ షీనా పిన తండ్రి పీటర్ ముఖర్జీయా వేసిన పిటీషన్ను డివిజన్ బెంచ్ సిట్టింగ్ జడ్జీ ఎస్సీ ధర్మధికారీ గురువారం విచారించారు.

ఈ సినిమా విడుదలయితే తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని పీటర్ కోర్టుకు తెలిపారు. సినిమాను విడుదల చేయడానికంటే ముందే తనను వీక్షించేందుకు అనుమతించాలని, ఆమేరకు వారికి ఆదేశించాలని కోర్టును కోరారు. సినిమా ఇంకా పూర్తి కాలేదని నిర్మాణానంతరం సీబీఎఫ్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఏవైనా అనుమానాలు ఉంటే మరలా కోర్టుకు రావొచ్చని ధర్మాసనం తెలిపింది.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ప్రజావాణీలో ఈ కేసు గురించి వినిపించిన కథనే తాము తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. చిత్ర దర్శకుడు అగ్నిదేవ్ ఛటర్జీ, నిర్మాతలు మాట్లాడుతూ న్యాయస్థానాలపై వారికి పూర్తి నమ్మకం ఉందని అన్నారు. త్వరలో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసి సెన్సార్ బోర్డుకు పంపుతామని చెప్పారు. ఈ చిత్రంలో మహిమా చౌదరి, రియా సేన్లు ఇంద్రాణీ ముఖర్జీయా, షీనాబోరా పాత్రల్లో కనిపించనున్నారు.