'ధ్యానం, ఆరోగ్యాన్ని వేటితో ముడిపెట్టవద్దు'

21 Nov, 2015 12:24 IST|Sakshi
'ధ్యానం, ఆరోగ్యాన్ని వేటితో ముడిపెట్టవద్దు'

భిన్న మతాలు, సంస్కృతులకు నిలయమైన భారత్లో ఎన్నో ఆచారాలు ఉన్నట్లే భిన్న నమ్మకాలున్నాయి... అయితే, ఈ విషయాలు ఆరోగ్యం, ధ్యానం లాంటి వాటికి అవరోధాలు కాకుడదని బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ అభిప్రాయపడ్డారు. పోలియోపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టార్తో పాటు బిగ్ బీ పాల్గొన్నారు. పోలియో మహమ్మారి వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీకా మందుల గురించి వివరించేందుకు రెండు మొబైల్ వాహనాలను ప్రారంభించారు.

పోలియో నిర్మూలనలో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కొన్ని వర్గాల ప్రజలు తమ నమ్మకాల కారణంగా యోగా చేయడం లేదన్న విషయాన్ని గుర్తించారు. భారత్ అన్నది అన్ని వర్గాల సమాహారం. ధ్యానం చేయడానికి ప్రతిఒక్కరూ అంగీకరించే విధంగా కొత్త రకం ఏర్పాటుచేయాలని భావిస్తే ఏలా అని పేర్కొన్నారు.  టీబీ లేని హర్యానా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పోలియో చుక్కలు ఎవరైనా వేసుకోవచ్చని, వీటిని ఏ అంశాలతోనూ ముడిపెట్టవద్దని సూచించారు. టీబీతో తాను పోరాడుతున్నానని, 2000లో  దీన్ని గుర్తించినప్పటి నుంచి ఇలాంటి అంశాలపై నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలని వాటి గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని భావించినట్లు బిగ్ బీ చెప్పుకొచ్చారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి