ఆయన మాటలే స్ఫూర్తి

15 Oct, 2018 00:42 IST|Sakshi
లక్ష్మణ్, శిరీష్, ‘దిల్‌’ రాజు, దేవిశ్రీ ప్రసాద్, రామ్, అనుపమ, త్రినాథరావు

‘దిల్‌’ రాజు

‘‘జీవితంలో మనం చాలా చూస్తుంటాం. గెలుపు, ఓటములు సహజం. అది క్రీడల్లో అయినా, రాజకీయాల్లో అయినా. మా సినిమా వాళ్ల విషయానికి వస్తే సక్సెస్, ఫెయిల్యూర్స్‌ వచ్చినా సినిమా తీయాలనే ప్యాషన్‌తో ఇక్కడే ఉంటూ.. సక్సెస్‌ గురించి ట్రావెల్‌ అవుతుంటారు’’ అని నిర్మాత ‘దిల్‌’రాజు అన్నారు. రామ్‌ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్‌గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 18న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ‘దిల్‌’రాజు మాట్లాడుతూ– ‘‘స్రవంతి’ రవికిషోర్‌గారు 30 ఏళ్లుగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. 2002 ఫిబ్రవరి 16న ‘అమృత’ సినిమాని విడుదల చేయడానికి తీసుకున్నాం. ‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్‌గా నిన్ను చూస్తాను’ అని రవికిషోర్‌గారు అనడంతో సోప్‌ వేస్తున్నాడనుకున్నాను. ‘బొమ్మరిల్లు’ సక్సెస్‌మీట్‌లో ఆయన గుర్తు చేసే వరకు నాకు గుర్తుకులేదు. నాలో ఏం చూసి ఆయన ఆ మాట అన్నారో తెలియదు. ఇప్పుడు ఏ సినిమా అయినా సక్సెస్‌ కాకపోతే.. ‘సక్సెస్, ఫెయిల్యూర్‌ కామన్‌. మనం ముందుకెళుతుండాలి’ అని ఆయన చెప్పిన మాటలను నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. ఆయనకు థ్యాంక్స్‌. ప్రసన్న చెప్పిన కథలోని ఓ పాయింట్‌కి నేను, రామ్, దేవిశ్రీ ప్రసాద్, ప్రకాశ్‌రాజ్‌గారు కనెక్ట్‌ అయ్యాం.

ఇది హిలేరియస్‌ మూవీ.. ఓ అద్భుతమైన పాయింట్‌ని సినిమాలో చూస్తారు’’ అన్నారు. ‘‘రాజుగారి లైఫ్‌లో ప్రేమకథలు ఉన్నాయో లేదో కానీ ప్రతి సినిమాను ఎంతగానో ప్రేమించేస్తారు. త్రినాథరావుగారితో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ముందు ప్రేక్షకుడు, ఆ తర్వాతే డైరెక్టర్‌. ప్రకాశ్‌రాజ్‌గారితో పనిచేయడం గౌరవంగా ఉంటుంది’’ అన్నారు రామ్‌. ‘‘104 డిగ్రీల జ్వరం ఉన్నా రామ్‌ అద్భుతంగా డ్యాన్స్‌ చేశాడు. రామ్, ప్రకాశ్‌రాజ్‌గారు పాటను చాలా చక్కగా పాడారు’’ అన్నారు త్రినాథరావు నక్కిన. ‘‘మా సినిమా పాటలను హిట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్‌. అనుపమా పరమేశ్వరన్, నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, పాటల రచయిత శ్రీమణి, నటుడు ప్రవీణ్, రచయిత ప్రసన్నకుమార్, సాయికృష్ణ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు