మహిళలూ జాగ్రత్త

24 Feb, 2020 05:47 IST|Sakshi
మేఘన, ప్రియాన్స్, శ్రీదేవి

నవీన్‌ .కె. చారి, ప్రియాన్స్‌, మేఘనా చౌదరి, సుమయ, కావ్య, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో వడ్ల జనార్థన్‌  దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో మేడమ్‌’. వడ్ల నాగశారద సమర్పణలో కార్తీక్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై వడ్ల గురురాజ్, వడ్ల కార్తీక్‌ నిర్మించారు. ఈ చిత్రం లోగోని ప్రముఖ దర్శకుడు సాగర్, తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌  ప్రతాని రామకృష్ణ గౌడ్‌ విడుదల చేశారు. ‘‘హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. విజయం సాధించాలి’’ అన్నారు సాగర్‌. ‘‘చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఉంది అనేది వాస్తవం.

ఎక్కువ థియేటర్లు దక్కేలా నా వంతు సహకారం అందిస్తా’’ అన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్‌. ‘‘తండ్రిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కొడుకు సినిమా తీయడం గ్రేట్‌’’ అన్నారు నిర్మాత టి. రామసత్యనారాయణ. వడ్ల జనార్ధన్‌  మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత సమాజంలో మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెప్పే చిత్రమిది’’ అన్నారు. ‘‘దిశా ఘటనకు ముందే ఈ సినిమా చేశాం. అమ్మాయిలపై ఓ సైకో చేసే కిరాతకాలను తెలియజేస్తున్నాం’’ అన్నారు ఘటికాచలం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు