ఎవరైనా సరే.. ఇంట్లోనే ఉండండి: హేమమాలిని

16 Apr, 2020 11:05 IST|Sakshi

ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ.. ఇంటి లోపలే ఉండి ప్రతిఒక్కరు లాక్‌డౌన్‌కు సహకరించాలని బాలీవుడ్‌ నటి, పార్లమెంటు సభ్యురాలు హేమమాలిని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వీయ నిర్భంధంలో ఉన్న హేమ లాక్‌డౌన్‌కు సహకరించాలంటూ వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ట్విటర్‌లో బుధవారం షేర్‌ చేశారు. (శ్మ‌శానంలో కుళ్లిన అర‌టిపండ్ల‌ను తింటున్న కూలీలు)

ప్రస్తుతం ‘భారతమాత(భారతదేశం) కరోనా మహమ్మారి కారణంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. మీరంతా దేశంలో పుట్టి.. పెరిగిన పౌరులు. కాబట్టి ప్రభుత్వ ఆదేశాలను పాటించడం పౌరులుగా అది మన కర్తవ్యం. ఏ మతానికి, జాతికి చెందిన వారైనా ఇంటి లోపలే ఉండటం ముఖ్యం. దీనివల్ల కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టవచ్చు. కరోనాపై లాక్‌డౌన్‌ ద్వారా గెలిచి మన భారతమాతను కాపాడుకుందాం. ఇందుకోసం దేశ పౌరులంతా ఇంకా కొన్ని రోజులు ఇంట్లోనే ఉండండి... కోవిడ్‌-19 బారినుంచి దేశాన్ని సంరక్షించండి’ అంటూ ఆమె పిలుపునిచ్చారు. కాగా కరోనా వైరస్‌ మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న కారణంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. (మరింత పటిష్టంగా లాక్‌డౌన్‌)

మరిన్ని వార్తలు