నిజమేనా?

15 Aug, 2018 01:06 IST|Sakshi

ఈ ఏడాది జనవరిలో రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలీజైన ‘పద్మావత్‌’ సినిమా నటీనటుల ఎంపిక జరుగుతున్న రోజులవి. ఆల్రెడీ ‘పద్మావత్‌’ సినిమాలో రాణి పద్మావతి పాత్రకు దీపికా పదుకోన్‌ని ఎంపిక చేశారు. ఖిల్జీ పాత్రకు రణ్‌వీర్‌సింగ్‌ని అనుకుంటున్నారు. పద్మావతి భర్త రాజా రతన్‌ సింగ్‌ రావల్‌ పాత్రకు ఎవరైతే బాగుంటుందా అని చిత్రదర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఆలోచిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ‘‘బాహుబలి: ది బిగినింగ్‌’ సినిమాలోని మహేంద్ర బాహుబలి... అదే మన ప్రభాస్‌ గుర్తొచ్చారట. వెంటనే.. ఆయన ప్రభాస్‌కు ‘పద్మావత్‌’ కథ చెప్పారట. ఆ సమయానికి ‘బాహుబలి: ది బిగినింగ్‌’ సినిమా రిలీజై మంచి ఊపు మీద ఉన్న ప్రభాస్‌ రతన్‌ సింగ్‌ పాత్రకు ‘నో’ చెప్పేశారట.

‘‘బాహుబలి ఫస్ట్‌ పార్ట్‌తో మంచి పాపులారిటీ వచ్చింది. ‘పద్మావత్‌’ సినిమాలో రతన్‌ సింగ్‌ది హీరో పాత్ర కాదు. ఇది ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌. ఇంకా ‘బాహుబలి–2’ రిలీజ్‌ కావాల్సి ఉంది. ఒకవేళ ఈ పాత్ర చేసి, బాక్సాఫీస్‌ వద్ద ‘పద్మావత్‌’ సక్సెస్‌ కాకపోతే ఆ ఎఫెక్ట్‌ ‘బాహుబలి –2’ మీద పడే అవకాశం ఉంది. ఐదేళ్ల కష్టం వృ«థా అవుతుంది’’... ఇలా ఆలోచించి ‘పద్మావత్‌’కి ప్రభాస్‌ నహీ అన్నారని బాలీవుడ్‌లో ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. యంగ్‌ రెబల్‌స్టార్‌ వద్దనడంతో ఆ పాత్ర షాహిద్‌ కపూర్‌కు వెళ్లింది. మరి... ఈ కథనాల్లో ఎంత వరకు వాస్తవం ఉందన్నది ‘పద్మావత్‌’ టీమ్‌ అయినా చెప్పాలి లేదా ప్రభాస్‌ అయినా చెప్పాలి. 

మరిన్ని వార్తలు