గోల్డెన్‌ టెంపుల్‌ను దర్శించుకొన్న అమిర్‌

30 Nov, 2019 18:52 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ హీరో, మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ అమిర్‌ ఖాన్‌ శనివారం అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించారు. లాల్‌సింగ్‌ చద్దా సినిమా షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం పంజాబ్‌లో ఉన్న ఈ సూపర్‌స్టార్‌ హర్‌మందిర్‌ సాహిబ్‌ గురుద్వారాలో ప్రార్థనలు జరిపారు. సిక్కుల పవిత్ర మందిరంలో అడుగీడే ముందు.. వారి ఆచారం ప్రకారం తలకు వస్త్రాన్ని చుట్టుకున్నారు. ప్రస్తుతం అమిర్‌ లుక్‌కు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. లాల్‌సింగ్‌ చద్దా కోసం పంజాబీ సర్దార్‌గా ఆమిర్‌ ఖాన్‌ మారిపోయిన సంగతి తెలిసిందే. హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌ సినిమాకు లాల్‌సింగ్‌ చద్దా హిందీ రీమేక్‌. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్‌ కథానాయిక. 

Aamir Khan Offers Prayers At Golden Temple In Amritsar. . . #aamirkhan #goldentemple

A post shared by Instant Bollywood (@instantbollywood) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా