‘నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించలేను’

10 Mar, 2020 17:05 IST|Sakshi

తమిళ నటుడు ఆర్య, నటి సయేషా సైగల్‌ ప్రేమ వివాహం చేసుకొని ఈ రోజుతో ఏడాది పూర్తి అవుతోంది. కొంతకాలం ప్రేమించుకున్న ఈ జంట గతేడాది మార్చి 10న వివాహ బంధంతో ఒకటయ్యారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ క్యూట్‌ కపూల్‌కి సెలబ్రిటీలు, అభిమానులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ శుభ సందర్భంగా సాయేషా, ఆర్య ఇద్దరూ ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇద్దరు కలిసి ప్రేమగా దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ('ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్‌ టైసన్‌లా')

ఈ మేరకు.. ‘నా జీవితాన్ని పరిపూర్ణం చేసిన వ్యక్తికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నువ్వు లేకుండా నా జీవితాన్ని అస్సలు ఊహించలేను జాన్‌. అన్ని వేళలా నువ్వు చూపే ప్రేమ అమూల్యమైనది. ఇప్పుడు.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. బెస్ట్‌ హస్బెండ్‌’ అంటూ ఆర్య మీద ఉన్న ప్రేమను సయేషా సైగల్ తెలియ జేశారు. అలాగే ఆర్య ‘ఎల్లకాలం అనే పదం చాలా పెద్దది. కానీ నేను నీతో ఉన్నప్పుడు సమయమే గుర్తురాదు. నీవల్ల నేను ఇంకా ఎక్కువ ఆనందంగా ఉ‍న్నాను. నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. లవ్‌ యూ సోమచ్‌ మై జాన్‌. హ్యాపీ యానివర్సరీ’ అంటూ భార్యకు  వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.

 
తమిళ్‌, హిందీ చిత్రాల్లో నటించిన సాయేషా.. ‘అఖిల్‌’ సినిమాతో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ మనువరాలు. గజినీకాంత్‌ చిత్రంలో కలిసి నటించిన ఆర్య, సయేషా.. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనూ ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి గతేడాది పెళ్లి పీటలెక్కారు. ఆర్య ప్రస్తుతం ‘టెడీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన భార్య సాయేషా సైగల్‌నే హీరోయిన్‌గా నటించడం విశేషం. ఈ రోజే సినిమా టీజర్‌ విడుదలవ్వడం మరో విశేషం.

మరిన్ని వార్తలు