ధనుష్ ’పవర్ పాండి’ ఫస్ట్ లుక్

7 Sep, 2016 12:55 IST|Sakshi
ధనుష్ ’పవర్ పాండి’ ఫస్ట్ లుక్

చెన్నై : హీరో ధనుష్ మరో కొత్త అవతారం ఎత్తాడు. నటుడు,  గాయకుడు, గీత రచయితగా, నిర్మాతగా మంచి మార్కులు కొట్టేసిన ఈ హీరో తాజాగా మెగాఫోన్ పట్టాడు. ప్రముఖ నటుడు రాజ్ కిరణ్ ప్రధాన పాత్రలో 'పవర్ పాండి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ విషయాన్ని ధనుష్ అధికారికంగా ధ్రువీకరించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దర్శకుడిగా ఈ సినిమా ధనుష్‌కి తొలి చిత్రం కాగా దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

రాజ్ కిరణ్తో పాటు ఈ చిత్రంలో ప్రసన్న, చాయసింగ్ నటిస్తున్నారు. కాగా కబాలి చిత్రానికి సంగీతం అందించిన షాన్ రోల్డాన్ ... ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించనున్నారు.అలాగే  ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటించనున్నారు. అయితే ఈ చిత్రంలో ధనుష్ నటిస్తాడా? లేదా?అన్నది మాత్రం సస్పెన్స్. ప్రస్తుతం ధనుష్ గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ’ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా’ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే ధనుష్ త్వరలో తన సొంత బ్యానర్పై రజనీకాంత్తో ఓ చిత్రాన్ని  పట్టాలెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహించనున్నాడు.