గోపీచంద్‌ సినిమా ఆరంభం

14 Dec, 2019 16:55 IST|Sakshi

గోపీచంద్‌, తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఓ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ గత నెలలో లాంఛనంగా ప్రారంభమైంది. షూటింగ్‌ ప్రారంభమై నెల దాటినా ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్స్‌ రాకపోవడంతో ఈ మూవీపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను చిత్ర బృందం అభిమానులకు తెలియజేసింది. ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ శనివారం నుంచి ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ షెడ్యూల్‌లో గోపీచంద్‌ కూడా పాల్గొన్నాడని సమాచారం.  

ఇక ఈ చిత్రంలో తమన్నా కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీని కోసం ఈ మిల్క్‌ బ్యూటీ కబడ్డీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే గోపీచంద్‌ పాత్ర మాత్రం చాలా సస్పెన్స్‌గా ఉంచాలని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. కాగా, ‘చాణక్య’ మూవీ ఫలితం తర్వాత గోపీచంద్‌ సినిమాలకు కాస్త విరామం ప్రకటించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విరామ సమయంలో పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే దర్శకుడు తేజతో గోపీచంద్‌ సినిమా తీయబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తనకు ‘గౌతమ్ నంద’ వంటి ఫ్లాప్ సినిమాను ఇచ్చిన డైరెక్టర్ సంపత్ నందికి మరోసారి గోపీచంద్ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. తమన్నా గతంలో సంపత్ నంది దర్శకత్వం వహించిన ‘బెంగాల్ టైగర్’, ‘రచ్చ’ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. సంపత్ నంది-తమన్న కాంబోలో ఇది మూడో చిత్రం. అటు గోపీచంద్ తో మాత్రం తమన్నాకు ఇదే ఫస్ట్ మూవీ. ఇక గోపీచంద్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మరోనాయిక దిగంగన సూర్యవంశిని తీసుకోవాలని మూవీ యూనిట్‌ భావిస్తున్నారట. భూమిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

సినిమా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు