గోపీచంద్‌ కెరీర్‌లో గేమ్‌ చేంజర్‌ మూవీ

27 Sep, 2019 00:38 IST|Sakshi

‘‘ఏడాదిన్నర క్రితం  తిరు ఈ కథ చెప్పినప్పుడు కొన్ని మార్పులు చెబితే చేశాడు. కథ అద్భుతంగా ఉంది. చెప్పిన కథను చెప్పినట్లుగానే తిరు అద్భుతంగా  తీశాడు. అనిల్‌ సుంకరగారు చాలా ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రాన్ని రాజీపడకుండా చాలా రిచ్‌గా నిర్మించారు. వెట్రితో నాకిది నాలుగో సినిమా. ఆయన  ఫోటోగ్రఫీ బ్యూటిఫుల్‌. అబ్బూరి రవి డైలాగ్స్‌ ట్రెండీగా ఉంటాయి. ఈ సినిమాలో నాతో హిందీలో కూడా డైలాగ్స్‌ చెప్పించారు. రాజస్థాన్‌ ఎండలో, చలిలో మా టీం చాలా కష్టపడి చేశాం’’ అని గోపీచంద్‌ అన్నారు. గోపీచంద్, మెహరీన్, జరీన్‌ ఖాన్‌ హీరో హీరోయిన్లుగా ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘చాణక్య’. దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సందర్బంగా గురువారం ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో అనిల్‌ సుంకర మాట్లాడుతూ– ‘‘స్పై బ్యాక్‌ డ్రాప్‌లో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన  ‘చాణక్య’ మా బేనర్‌కు ఒక మెమొరబుల్‌ మూవీ అవుతుంది. తిరు చాలా టాలెంటెడ్‌. ఈ సినిమాకి మేం ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్‌ మీద రెండింతలు కనపడేలా చేశారు. ఈ స్పై థ్రిల్లర్‌లో మంచి వినోదం కూడా ఉంది. గోపీచంద్‌ కెరీర్‌లో ఇది ఒక గేమ్‌ చేంజర్‌ మూవీ అవుతుంది. అబ్బూరి రవి మంచి డైలాగ్స్‌ రాశారు. రామజోగయ్య శాస్త్రి గారు మంచి పాటలు రాశారు’’ అన్నారు. తిరు మాట్లాడుతూ – ‘‘సినిమా పై 100 శాతం నమ్మకంగా ఉన్నాం. ఇది నా మనసుకి బాగా నచ్చిన స్క్రిప్ట్‌. అనిల్‌ సుంకర గారు బడ్జెట్‌ విషయంలో కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు’’ అన్నారు. రచయితలు అబ్బూరి రవి, రామజోగయ్య శాస్త్రి, మెహరీన్, జరీన్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: రాజేష్‌ దండ, కో–ప్రొడ్యూసర్‌: అజయ్‌ సుంకర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణకిషోర్‌ గరికపాటి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా