సినిమా నా కల: హీరో కార్తికేయ

24 Nov, 2019 08:38 IST|Sakshi
90ఎంఎల్‌ సినిమా యూనిట్‌కు స్వాగతం పలుకుతున్న సెక్రటరీ రామ్‌ ప్రసాద్, ప్రిన్సిపాల్‌

90ఎం.ఎల్‌ సినీ యూనిట్‌ సందడి

సాక్షి, ఒంగోలు మెట్రో: ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో యూత్‌ని ఆకట్టుకున్న నవతరం హీరో కార్తికేయ శనివారం ఒంగోలులో సందడి చేశారు. ఆ సినిమాతో యూత్‌ మదిలో నిలిచిపోయిన ఆయన కొత్త దర్శకుడు శేఖరరెడ్డితో తీసిన ‘90ఎం.ఎల్‌’ సినిమా ప్రమోషనింగ్‌ వర్క్‌లో భాగంగా శనివారం సాయంత్రం ఒంగోలు నాగార్జున డిగ్రీ కాలేజీకి వచ్చారు. ఈ సందర్భంగా తొలుత కాలేజీ సెక్రటరీ వి.రాంప్రసాద్, ప్రిన్సిపాల్‌ వసంతలక్ష్మిలు సినీ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన 90 ఎం.ఎల్‌ సినిమా హీరోయిన్‌ నేహాతో కలిసి విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్టాడారు. సినిమా తనకొక మధురమైన కల అని, దానిని ఆస్వాదిస్తున్నానన్నారు. సినిమా టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందుతుందని, టైటిల్‌ లాగానే సినిమా కూడా ఆసక్తికరంగా ఉంటుందన్నారు.

అనూప్‌ రూబెన్స్‌ పాటలకు చిందేసి ఆడాల్సిందేంటూ కితాబిచ్చారు. అనంతరం విద్యార్థుల కోరిక మేరకు సరదాగా డ్యాన్స్‌ చేశారు. కార్యక్రమానికి సంచాలకులుగా వైస్‌ ప్రిన్సిపాల్‌ యోగయ్య చౌదరి, తెలుగు లెక్చరర్‌ డాక్టర్‌ నూనె అంకమ్మరావులు వ్యవహరించగా, సినీ బృందం, పలువురు లెక్చరర్లు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీగాయత్రి కళాశాలలో.. కందుకూరు రూరల్‌: డిసెంబర్‌ 5వ తేదీ విడుదల కానున్న 90ఎంఎల్‌ సినీమా ఆదరించాలని హీరో కార్తికేయ, హిరోయిన్‌ నెహ అన్నారు. స్థానిక శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాంగ్‌ లీడర్‌ సినీమాలో విలన్‌ పాత్ర చేశానని చెప్పారు. గతంలో కందుకూరుకు వచ్చినట్లు చెప్పారు. వీరి వెంట కళాశాల కరస్పాండెంట్‌ సీహెచ్‌ రామకృష్ణారావు, ప్రిన్సిపాల్‌ గీతా శ్రీనివాస్‌లు ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు