రాజమౌళితో మహేశ్‌ సినిమా ఆశించొచ్చా?

31 May, 2020 19:57 IST|Sakshi

దిగ్గజ నటుడు కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆయన తనయుడు సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ‘ఆస్క్‌ మీ యువర్‌ క్వశ్చన్స్‌!’ పేరుతో ఆదివారం సాయంత్రం నిర్వహించిన లైవ్ ‌చాట్‌లో అభిమానుల ప్రశ్నలకు మహేశ్‌ తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.

మీకు ఇష్టమైన కలర్‌, ఫుడ్‌ ఎంటీ?
నాకు ఇష్టమైన కలర్‌ బ్లూ, ఫుడ్‌ విషయానికి వస్తే నేను ఎప్పుడూ ఇష్టపడే హైదరాబాద్‌ బిర్యాని.

క్వారంటైన్‌ లైఫ్‌ ఎలా ఉంది? 
చాలా గొప్ప అనుభూతినిచ్చింది.   

మీ ఫేవరెట్‌ గేమ్‌ ఎంటీ?
నా ఫేవరెట్ గేమ్‌ టెన్నిస్‌, గోల్ఫ్‌, గౌతమ్‌తో కలిసి ఆన్‌లైన్‌‌ బేస్‌బాల్‌ ఆడుతాను.

మీ పిల్లల కోసం మీరు తయారు చేసే బెస్ట్‌ డిష్‌ ఎంటీ?
మ్యాగీ నూడిల్స్

మీకు ఇన్‌స్పిరేషన్‌ ఎవరు?  
మా నాన్న

మీరు నమ్రత మేడమ్‌ను ఎంత ప్రేమిస్తారు? 
ముందు నువ్వు పెళ్లి చేసుకున్నావా చెప్పు(నవ్వుతూ)

ఒక్క మాటలో మీ నాన్న గురించి చెప్పండి?
ఒక్కమాటలో చెప్పలేను

మిమ్మల్ని జేమ్స్‌ బాండ్‌ మూవీలో చూడాలనుకుంటున్నాము. భవిష్యత్తులో ఆ సినిమా వస్తుందా? 
మీకు ఇష్టమైతే, నాతో చేయాలనుకుంటే మంచి స్క్రిప్ట్‌‌ పంపించు.

మీకు టీ 20, టెస్ట్‌ ఫార్మాట్లలో ఏది ఇష్టం? 
టెస్ట్‌ ఫార్మాట్‌​

భవిష్యత్తులో పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తారా?
తప్పకుండా చేస్తాను. నా ఫేవరెట్‌ దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన మంచి కథతో వస్తే తప్పకుండా సినిమా చేస్తాను.

కర్ణాటక అభిమానుల గురించి ఒక్కమాటలో చెప్పండి?
సూపర్‌ కూల్‌

ఎస్. ఎస్. రాజమౌళితో సినిమా ఆశించొచ్చా?
తప్పకుండా. నేను కూడా దాని కోసమే ఎదురుచూస్తున్నా

ఎవరిపైనైనా క్రష్‌ ఉందా? 
నాకు 26 ఏళ్ల వయస్సులోనే క్రష్‌ ఉండేది. ఆమెనే (నమ్రత శిరోద్కర్) పెళ్లి  చేసుకున్నా

మైండ్‌ బ్లాక్‌  సాంగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ డాన్స్ గురించి మీరేమంటారు?
చాలా బాగా చేశాడు.

మీ బెస్ట్‌ ఫ్రేండ్‌ ఎవరు?
నమ్రత

మీ నిక్‌ నేన్‌ ఎంటీ?‌
నాని

మీ పెట్‌ డాగ్స్‌‌ పేర్లు చెప్పండి?
నోబిటా, ప్లూటో

భవిష్యత్తులో గౌతమ్‌ హీరోగా నటిస్తారా?
కాలమే సమాధానం  చెబుతుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా