డైరెక్షన్‌ మారింది

9 Nov, 2018 02:46 IST|Sakshi
విశాల్‌

వరుస విజయాలతో హీరోగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో దూసుకెళ్తున్నారు విశాల్‌. తాజాగా ఆయన డైరెక్షన్‌.. డైరెక్షన్‌ వైపునకు మళ్లిందట. 2019లో కెమెరా ముందు నుంచి వెనక్కి వెళ్లే ప్లాన్‌లో ఉన్నారట. నిజానికి ఇండస్ట్రీలోకి విశాల్‌ అడుగుపెట్టింది సహాయ దర్శకుడిగానే. హీరో అర్జున్‌ దగ్గర సహాయ దర్శకుడిగా కొన్ని నెలలు చేశారు. ఇప్పుడు దర్శకుడిగా మారనున్నారు. నిస్సహాయంగా ఉన్న వీధి కుక్కల మీద ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన జనవరి 2019లో రానుంది. మరి ఈ సినిమాలో ఆయన కనిపిస్తారా? లేదా? వేచి చూడాలి.

మరిన్ని వార్తలు