కేశవ పరుగు

25 Dec, 2016 23:33 IST|Sakshi
కేశవ పరుగు

‘‘ప్రాణం కన్నా పగ, ప్రతీకారాలకు విలువ ఇస్తే ఏం జరుగుతుంది? రక్తంతో ఎరుపెక్కిన నదిలో పరుగులు తీస్తోన్న ఆ యువకుడి కథేంటి? తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగండి’’ అంటున్నారు దర్శకుడు సుధీర్‌వర్మ. నిఖిల్, రితూ వర్మ జంటగా ఆయన దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మిస్తున్న సినిమా ‘కేశవ’. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఇటీవల రిలీజ్‌ చేశారు. అభిషేక్‌ నామా మాట్లాడుతూ – ‘‘జనవరి 2 నుండి 10 వరకూ నరసాపురంలో జరిపే చిత్రీక రణతో సినిమా పూర్తవుతుంది.

నిఖిల్, సుధీర్‌ వర్మ కలయికలో వచ్చిన ‘స్వామి రారా’లా ఈ సినిమా కూడా ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది’’ అన్నారు. ఇషా కొప్పికర్, రావు రమేశ్, అజయ్, బ్రహ్మాజీ, ప్రియదర్శి నటిస్తున్న ఈ చిత్రానికి అర్ట్‌: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్‌ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్‌., సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సమర్పణ: దేవాన్ష్‌ నామా.