వారికి శర్వానంద్‌ ఆదర్శం

15 Aug, 2019 05:10 IST|Sakshi
నాగవంశీ, కల్యాణి, నితిన్, శర్వానంద్, సుధీర్‌ వర్మ, పీడీవీ ప్రసాద్‌

‘‘ఏ బ్యాక్‌ సపోర్ట్‌ లేకుండా శర్వానంద్‌ ఈ స్థాయిలో ఉండటం నిజంగా గొప్ప విషయం. ఎంతోమంది యువ హీరోలకు శర్వానంద్‌ ఆదర్శం’’ అని హీరో నితిన్‌ అన్నారు. శర్వానంద్, కాజల్‌ అగర్వాల్, కల్యాణీ ప్రియ దర్శన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రి–రిలీజ్‌ వేడుకలో అతి«థిగా పాల్గొన్న నితిన్‌ మాట్లాడుతూ– ‘‘ ఈ కథ విన్నప్పుడు శర్వా ఈ సినిమాలో 45 ఏళ్ల వ్యక్తిగా ఎలా కనిపిస్తాడా? అనుకున్నా.

కానీ పోస్టర్స్, ప్రోమోస్‌ చూస్తుంటే కరెక్ట్‌గా సెట్‌ అయ్యాడనిపిస్తోంది. డైరెక్టర్‌ సు«ధీర్‌ వర్మ మంచి టెక్నీషియన్‌’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. దర్శకుడు సుధీర్‌ వర్మ టేకింగ్‌ సినిమాకు అదనపు ఆకర్షణ. నేను హ్యాపీగా ఉన్నానని వంశీ చెప్పడం ఇంకా హ్యాపీ. ‘రణరంగం’ చూసిన యూనిట్‌ అంతా సినిమా బాగుందంటున్నారు. ప్రేక్షకులు కూడా ఇదే అభిప్రాయం చెబుతారనుకుంటున్నా’’ అన్నారు శర్వానంద్‌. ‘‘ఇందులో హీరో శర్వానంద్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. శర్వా బాగా నటించారు’’ అన్నారు సుధీర్‌వర్మ. ‘‘శర్వానంద్‌ దగ్గర కొత్త విషయాలు నేర్చుకున్నా. అనుకున్న కథను స్క్రీన్‌పై అద్భుతంగా ప్రజెంట్‌ చేశారు సుధీర్‌వర్మగారు. నిర్మాతల సహకారం మరవ లేనిది’’ అన్నారు కల్యాణీ ప్రియదర్శన్‌.
 

మరిన్ని వార్తలు