‘ఇద్దరి లోకం ఒకటే’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

7 Oct, 2019 16:31 IST|Sakshi

యంగ్‌ హీరో రాజ్ తరుణ్‌ కథానాయకుడిగా దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్న ప్రేమకథా చిత్రం.. ‘ఇద్దరిలోకం ఒకటే’. యూ ఆర్ మై హార్ట్ బీట్ ట్యాగ్ లైన్. ఈ సినిమాతో జిఆర్. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాజ్‌ తరుణ్‌ సరసన ‘అర్జున్‌ రెడ్డి’ ఫేం శాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్‌ సంగీత మందిస్తున్నారు. అభిమానులకు దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. 

రాజ్‌ తరుణ్‌కు ‘కుమారి 21 ఎఫ్‌’తర్వాత ఆ స్థాయి విజయం లేక వెనకబడిపోయాడు. అయితే ఫలితాల సంబంధం లేకుండా వరుస సినిమాలతో అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. బాక్సీఫీస్‌ వద్ద విజయాలు సాధించడం లేదు. అయితే విజయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన దిల్‌ రాజు మినిమమ్‌ కంటెంట్‌ ఉంటే గాని సినిమాను నిర్మించరు. దీంతో ‘ఇద్దరిలోకం ఒకటే’తో రాజ్‌ తరుణ్‌ మళ్లీ విజయాల బాట పడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు