అంధుడిగా యంగ్ హీరో

25 Jun, 2016 09:06 IST|Sakshi
అంధుడిగా యంగ్ హీరో

నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్, ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నాడు. ప్రస్తుతం ఉయ్యాల జంపాల ఫేం విరింఛి వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్, తరువాతి సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు. నేను శైలజ తరువాత కథల ఎంపికలో ఆచి తూచి అడుగులు వేసిన రామ్, వరుసగా రెండు సినిమాలకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు తన తర్వాతి సినిమాలో ఓ రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న రామ్, మాస్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకుంటున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను అంగీకరించాడు. కామెడీ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమాలు తెరకెక్కించే అనిల్, రామ్ కోసం ఎనర్జిటిక్ స్టోరీని రెడీ చేశాడట. అయితే ఈ సినిమాలో రామ్ అంధుడి పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా ప్రకటించాడు.

అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన సుప్రీమ్ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తన తదుపరి సినిమాను ప్రకటించాడు. రామ్ హీరోగా తన సినిమా ఉంటుదన్న అనిల్, ఆ సినిమాలో హీరో పాత్ర ‘అంధుడు’ అంటూ షాక్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు ప్రయోగాలకు పెద్దగా ఇష్టపడని రామ్ తొలిసారిగా చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.