మారొచ్చు ట్రెండు!

3 Oct, 2018 00:27 IST|Sakshi

నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు ప్రకాశ్‌రాజ్‌. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా రూపొందిన ‘సాక్ష్యం’ సినిమాకు ఆయన వాయిర్‌ ఓవర్‌ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడాయన ‘హలో గురు ప్రేమకోసమే...’ సినిమా కోసం హీరో రామ్‌తో కలిసి పాట పాడారు.

నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ సినిమాలో ‘ఫ్రెండ్‌ కోసం మారొచ్చు ట్రెండు’ అనే పాటను కలిసి పాడారట రామ్‌ అండ్‌ ప్రకాశ్‌రాజ్‌. ఈ పాటను త్వరలోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్‌. ఈ చిత్రాన్ని దసరా పండగ సందర్భంగా ఈ నెల 18న విడుదల చేయాలనుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు