హీరో రానా తమ్ముడి హల్ చల్

29 Nov, 2015 14:21 IST|Sakshi
హీరో రానా తమ్ముడి హల్ చల్

హైదరాబాద్: జూబ్లీహిల్స్లో సినీ హీరో రానా తమ్ముడు అభిరామ్ హల్ చల్ చేశాడు. తమ కారును ఢీకొన్న వ్యక్తులపై అతడు దాడికి దిగాడు. కారును ఢీకొట్టిన వ్యక్తులపై భౌతికంగా దాడి చేసినట్లు తెలిసింది. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజిలో రికార్డయిన ప్రకారం జూబ్లీహిల్స్ చౌరస్తాలో బైక్పై వచ్చిన ఇద్దరు విదేశీయులు అభిరామ్ వస్తున్న కారు ముందుభాగానికి కొంచెం తగిలించారు.

అనంతరం వారు వెళ్లిపోతుండగా కారులో నుంచి కిందికి దిగిన అభిరామ్ ఆ విదేశీయులను వెంబడించి వారిపై దాడికి దిగాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు తప్పు ఎవరిదనే విషయంపై పరిశీలన చేస్తున్నారు. కారును ఎవరు ఢీకొట్టారు.. ఆ సమయంలో ఎలాంటి వాగ్వాదం చోటుచేసుకుంది? ముందు ఎవరు దాడి చేశారు అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.