వైజాగ్‌ సెంటిమెంట్‌

15 Dec, 2017 10:20 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న హీరో సప్తగిరి, హీరోయిన్‌ కౌశిష్‌ వర

ఇక్కడ నుంచే సక్సెస్‌ టూర్‌

సప్తగిరి ఎల్‌ఎల్‌బీ హీరో సప్తగిరి

జ్యోతి థియేటర్‌లో సప్తగిరి

ఎల్‌ఎల్‌బీ సినిమా యూనిట్‌

అల్లిపురం(విశాఖ దక్షిణ): వైజాగ్‌ సెంటిమెంట్‌ మాకు బాగా లాభించిందని సప్తగిరి ఎల్‌ఎల్‌బీ హీరో సప్తగిరి అన్నారు. తన మొదటి సినిమా సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ సక్సెస్‌ టూర్‌ వైజాగ్‌ నుంచే ప్రారంభించామన్నారు. అదే విధంగా తన రెండో సినిమా సప్తగిరి ఎల్‌ఎల్‌బీ విజయోత్సవ యాత్ర కూడా వైజాగ్‌ నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. వైజాగ్‌ ప్రేక్షకుల ఆశీర్వాదం గొప్పదని, వారి ఆదరణ ఉంటే సక్సెస్‌ తనంతట అదే వస్తుందన్నారు. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటెక్‌ క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, బ్యానర్‌పై , డాక్టర్‌ రవికిరణ్, డైరెక్టర్‌ చరణ్‌ లక్కోజుల నిర్మించిన సప్తగిరి ఎల్‌ఎల్‌బీ విజయోత్సవ యాత్రలో భాగంగా చిత్ర బృందం గురువారం జ్యోతి థియేటర్‌కు వచ్చింది.

ఈ సందర్బంగా చిత్ర హీరో విలేకరులతో మాట్లాడుతూ మోసం తెలియని రైతుల తరఫున కోర్టులో వాదించిన న్యాయవాదిగా ఈ చిత్రంలో తాను చేసిన పాత్ర సంతృప్తి నిచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని ఆయన కోరారు. చిత్ర హీరోయిన్‌ కౌశిష్‌ వర మాట్లాడుతూ తను నటించిన చిత్రం విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత డాక్టర్‌ రవికిరణ్‌ మాట్లాడుతూ తమ మొదటి చిత్రం మాదిరిగానే రెండో చిత్రం విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ నుంచే విజయోత్సవ టూర్‌ను నిర్వహిస్తున్నామన్నారు. రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో ఈ టూర్‌ ఉంటుందన్నారు. చిత్ర దర్శకుడు చరణ్‌ లక్కోజుల మాట్లాడుతూ చిత్రంలో సప్తగిరి యాక్షన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు