నిర్మాత‌ల‌ను నామినేట్ చేసిన శ‌ర్వానంద్

13 Jul, 2020 18:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌ను  స్వతహాగా స్వీకరించి బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన ఉన్న పార్క్‌లో  సోమ‌వారం హీరో శ‌ర్వానంద్ మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా పార్కును ద‌త్త‌త తీసుకొని అభివృద్ధి చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా కార్య‌క్ర‌మం చాలా గొప్ప విష‌య‌మ‌ని కొనియాడారు. ఆయ‌న్ను స్ఫూర్తిగా తీసుకొనే తాను స్వ‌త‌హాగా మొక్క‌లు నాటాన‌ని శర్వానంద్ తెలిపారు.  భ‌విష్య‌త్తులో గాలి కూడా కొనాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అలాంటిది రాకూడ‌దంటే ప్ర‌తీ ఒక్క‌రూ విధిగా మొక్క‌లు నాటాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ సంతోష్ కుమార్, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పొల్గొన్నారు.  ఈ చాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటాల‌ని నిర్మాత‌లు  అనిల్ సుంక‌ర‌, గోపిఆచంట‌, ప్ర‌మోద్, వంశీ, సుధాక‌ర్ చెరుకూరిల‌కు  శ‌ర్వానంద్ స‌వాల్ విసిరారు.  ఈ సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీక‌రించ‌డ‌మే కాకుండా దత్త‌త తీసుకుంటాన‌న‌డం గొప్ప విష‌య‌మ‌ని ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. 
(నాగ్‌ మామ చాలెంజ్‌ యాక్సెప్టెడ్‌)


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా