రేటింగ్స్‌ కోసం అలా రాయొద్దు

10 Mar, 2018 00:28 IST|Sakshi
శ్రీకాంత్‌

‘‘రేటింగ్స్‌ కోసం, లైక్స్‌ కోసం అవాస్తవ వార్తలను ప్రచారం చేయటం తప్పు’’ అని మండిపడ్డారు హీరో శ్రీకాంత్‌. ఇటీవల బెంగళూర్‌ షూటింగ్‌లో శ్రీకాంత్‌  గాయపడ్డారంటూ కొన్ని యూట్యూబ్‌ చ్యానల్స్‌ ప్రచారం చేశాయి. దానికి ఆయన ఘాటుగా స్పందిస్తూ – ‘‘నేను షూటింగ్‌ చేసుకుంటూ ఉండగా సడెన్‌గా ఫోన్‌ కాల్స్‌ రావడం స్టార్ట్‌ అయ్యాయి.

నా కుటుంబ సభ్యులు, అభిమానులు కంగారుపడి ఫోన్‌ చేశారు. కల్పిత వార్తలకు వాయిస్‌ ఓవర్‌ యాడ్‌ చేసి లైక్స్‌ తెచ్చుకోవటం, సబ్‌స్క్రైబర్స్‌ పెంచుకోవటం కోసం యూట్యూబ్‌లో వీడియోస్‌ పెట్టడం చాలా పెద్ద తప్పు. దీన్ని తీసుకొని మరికొన్ని వెబ్‌సైట్స్‌ కూడా వార్తలు రాస్తున్నాయి. ఇలాంటి అసత్యపు వార్తలను రాయొద్దు. ఈ విషయాన్ని ‘మా’ అసోసియేషన్‌ కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. ఇలాంటి అసత్య ప్రచారం జరిపిన వారిపై సైబర్‌ క్రైమ్‌ ఎస్‌.పి రామ్మోహన్‌ గారికి ‘మా’ ద్వారా కంప్లైట్‌ చేయనున్నాం’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు