మంచి చిత్రాలను ఆదరించాలి

27 Jun, 2020 05:55 IST|Sakshi
‘చిత్రం ఎక్స్‌’ చిత్ర బృందంతో శ్రీకాంత్‌

– శ్రీకాంత్‌

‘‘చిత్రం ఎక్స్‌’ సినిమా ట్రైలర్‌ చాలా బాగుంది. ఇటువంటి మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా. హీరో రాజ్‌బాల, యూనిట్‌కి ఆల్‌ ద బెస్ట్‌’’ అన్నారు శ్రీకాంత్‌. రాజ్‌బాల, మానస జంటగా రమేష్‌ వీభూది దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘చిత్రం ఎక్స్‌’. శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవీ మూవీ క్రియేషన్స్‌ పతాకంపై పొలం గోవిందయ్య నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను శ్రీకాంత్‌ విడుదల చేశారు. రమేష్‌ వీభూది మాట్లాడుతూ– ‘‘14 సంవత్సరాలు దర్శకత్వ శాఖలో చేశాను. తేజాగారివద్ద సహాయ దర్శకుడిగా చేశా.

మా సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘కరోనా కష్టకాలంలో పెద్ద మనసుతో శ్రీకాంత్‌గారు మా ట్రైలర్‌ని విడుదల చేసి, మమ్మల్ని ఆశీర్వదించడం హ్యాపీ. మా సినిమా అవుట్‌పుట్‌ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను ’’ అన్నారు పొలం గోవిందయ్య. ‘‘40 రోజులు భయంకరమైన అడవిలో మేం పడ్డ కష్టాన్ని శ్రీకాంత్‌గారి అభినందనలతో మరిచిపోయాం’’ అన్నారు రాజ్‌బాల. ఈ చిత్రానికి సంగీతం: శివప్రణయ్, కెమెరా: ప్రవీణ్‌. కె. కావలి.

మరిన్ని వార్తలు