సినిమా చూస్తే పోలీసులే మెచ్చుకుంటారు: హీరో శ్రీకాంత్

8 Apr, 2016 20:24 IST|Sakshi
తిరుమల : ‘మెంటల్ పోలీస్’ చిత్రం పోలీసులు, పోలీసు విభాగం గొప్పతనాన్ని తెలియజేసే సినిమా అని హీరో శ్రీకాంత్ అన్నారు. ఉగాది పర్వదినం సందర్బంగా శుక్రవారం సతీమణి ఊహ, కుమారుడు రోషన్, కుమార్తె మేధతో కలసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను నటించిన మెంటల్ పోలీస్ చిత్రంపై పోలీసు సంఘాలు ఇచ్చిన నోటీసులకు ఆయన వివరణ ఇచ్చారు. 
 
తనకు పోలీసులన్నా, పోలీసు విభాగం అన్నా ఎంతో గౌరవమని, వారిని కించపరిచే పని ఏ సందర్భంలోనూ చేయనన్నారు. ఈ చిత్రం చూసిన తర్వాత పోలీసులు మెచ్చుకుంటారన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదే సందర్భంగా తన కుమారుడు రోషన్ నటిస్తున్న చిత్రం జూన్, జూలైలో విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. హీరో నాగార్జున నిర్మించే చిత్రంలో తన కుమారుడు నటిస్తున్నాడని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.