అప్పుడు నృత్యం చేశా.. ఇప్పుడు అతిథిగా వచ్చా

9 Feb, 2020 11:45 IST|Sakshi
సినీ హీరో తనీ‹Ùతో గాలాయగూడెం ఉత్సవ కమిటీ కోశాధికారి పెద్దిశెట్టి నాని

సాక్షి, పశ్చిమగోదావరి: దెందులూరు మండలంలోని గాలాయగూడెం అచ్చమ్మ పేరంటాలు తల్లి ఉత్సవాలతో తనకు చిన్ననాటి నుంచి అనుబంధం ఉందని సినీ హీరో తనీష్‌ చెప్పారు. శుక్రవారం గాలాయగూడెం శ్రీ అచ్చమ్మపేరంటాలు తల్లి 63వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా తొలుత ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఏనుగు సర్వేశ్వరరావు తదితరులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తనిష్‌ విలేకరులతో మాట్లాడుతూ తాను చిన్నవయస్సులోనే అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో నృత్యం చేశానన్నారు. మళ్లీ సినీ హీరోగా అమ్మవారి సన్నిధిలో ముఖ్య అతిథిగా రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకూ 20కి పైగా సినిమాలు చేశానన్నారు. హిందుస్తాన్‌ సినిమాకు నంది అవార్డు వచ్చిందని, నచ్చావులే, రైడ్, మేము వయసుకు వచ్చాం సినిమాలు ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయన్నారు. చలనచిత్ర పరిశ్రమకు అంబికా కృష్ణ తనను పరిచయం చేశారని, హీరోగా రవిబాబు అవకాశం కలి్పంచారని చెప్పారు. ప్రస్తుతం మహాప్రస్థానం సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. 

మరిన్ని వార్తలు