పెళ్ళిచూపులు రోజులు గుర్తొస్తున్నాయి

20 Nov, 2018 03:40 IST|Sakshi
హర్ష, విజయ్‌ దేవరకొండ, బెక్కెం వేణుగోపాల్‌

విజయ్‌ దేవరకొండ  

‘‘పెళ్ళిచూపులు’ సినిమాకి ముందే ‘హుషారు’ కథని దర్శకుడు హర్ష పంపించారు. స్క్రిప్ట్‌ చదువుతున్నప్పుడే నాకు విపరీతంగా నవ్వు వచ్చింది. నాకు నచ్చే అర్బన్‌ టైప్‌ కామెడీ ఉంటుంది. ట్రైలర్‌ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్‌ కలిగింది. ‘హుషారు’ పోస్టర్, ట్రైలర్లను చూస్తుంటే నాకు ‘పెళ్ళిచూపులు’ సినిమా రోజులు గుర్తొస్తున్నాయి’’ అని హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. తేజస్‌ కంచెర్ల, తేజ్‌ కూరపాటి, దినేష్‌ తేజ్, అభినవ్‌ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగర్‌కర్, ప్రియా వడ్లమాని, హేమల్‌ హీరోయిన్లుగా రాహుల్‌ రామకృష్ణ ముఖ్య పాత్రలో శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హుషారు’.

లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్, రియాజ్‌ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 7న విడుదలవుతోంది. ఈ సినిమాలోని మూడో పాటను ‘డియర్‌ కామ్రేడ్‌’ షూటింగ్‌లో విజయ్‌ దేవరకొండ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఫ్రెండ్‌షిప్‌పై రూపొందించిన పాట బాగుంది. ప్రేక్షకులకు నచ్చుతుంది. మొదటి సినిమా చేస్తున్నప్పుడు ఉండే ఉత్సాహం హర్షలో కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘విజయ్‌తో మంచి రిలేషన్‌ ఉంది. అందుకే పాటను రిలీజ్‌ చేయమని అడగ్గానే సంతోషంగా ఒప్పుకొన్నారు’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్‌. ‘‘పెళ్ళిచూపులు’కి ముందు నుంచి విజయ్‌తో పరిచయం ఉంది’’ అని హర్ష చెప్పారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు